allu arjun: ఇక పోటీయేనా?: ఒకేరోజున రానున్న మహేశ్, బన్నీల సినిమాలు!

  • ఏప్రిల్ 26వ తేదీనే 'భరత్ అనే నేను' 
  • అదే రోజు రానున్న 'నా పేరు సూర్య' 
  • అందరిలో పెరుగుతోన్న ఆసక్తి

వక్కంతం వంశీ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ హీరోగా ' నా పేరు సూర్య' రూపొందుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే చెప్పారు. అయితే ఒక రోజు ముందే .. అంటే 26వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజాగా నిర్మాత బన్నీ వాసు స్పష్టం చేశారు.

ఇక కొరటాల - మహేశ్ బాబు కాంబినేషన్లోని 'భరత్ అనే నేను' సినిమాను కూడా ముందుగా ఏప్రిల్ 27వ తేదీనే విడుదల చేయనున్నట్టు చెప్పారు. తాజాగా వాళ్లు కూడా ఒక రోజు ముందుగానే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటం వలన, ఓపెనింగ్స్ పరంగా ఏ సినిమా రికార్డు సృష్టిస్తుందో చూడాలి.   

More Telugu News