Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఆస్తితో మన దేశాన్ని 20 రోజులు నెట్టుకురావచ్చట!

  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన ‘బ్లూమ్‌బర్గ్’
  • 40.3 బిలియన్ డాలర్ల ముకేశ్ ఆస్తి కేవలం 20 రోజులకే చెల్లు!
  • 49 దేశాల్లో బ్లూమ్‌బర్గ్ పరిశోధన
  • అలీబాబా అధినేత ఆస్తి చైనాకు నాలుగు రోజులకే సరి

ముకేశ్ అంబానీ.. దేశంలో, కాదు..కాదు.. ప్రపంచంలోనే పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఆయన ఒకరు. ఏటా కుప్పలా పేరుకుపోతున్న ఆయన ఆస్తితో దేశాన్ని ఎన్ని రోజులు నడిపించొచ్చు? ఇదే విషయంపై ‘బ్లూమ్‌బర్గ్ మీడియా’ నిర్వహించిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

డిసెంబరు 2017 నాటికి ఆయా దేశాల్లోని అత్యంత సంపన్నుడి మొత్తం ఆస్తి.. ఆయా ప్రభుత్వాల రోజువారీ ఖర్చులతో పోల్చి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు నడపవచ్చో ‘బ్లూమ్‌బర్గ్’ అంచనా వేసింది. మొత్తం 49 దేశాల్లోని ధనవంతులను ఇందుకోసం ఎంచుకుని ‘2018-రాబిన్‌హుడ్ ఇండెక్స్’ పేరుతో జాబితాను విడుదల చేసింది.

మన దేశంలోని అత్యంత సంపన్నుడిగా ఖ్యాతికెక్కిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. ఇంతటి ఆస్తితోనూ ప్రభుత్వాన్ని కేవలం 20 రోజలు మాత్రమే నడపవచ్చట. ఇక, చైనా అపరకుబేరుడు, అలీబాబా అధినేత జాక్ సంపదతో ఆ దేశ ప్రభుత్వం నాలుగంటే నాలుగు రోజులే నడుస్తుందట. సైప్రస్ కుబేరుడు జాన్ ఫ్రెడ్రిక్సన్ తన సంపదతో ప్రభుత్వాన్ని ఏకంగా 441 రోజులు నడపవచ్చని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

More Telugu News