Chhattisgarh: అతి దారుణం.. లైంగిక వేధింపులకు గురైన బాలికకు అరగుండు చేసి... బహిష్కరించిన వైనం!

  • లైంగిక వేధింపులకు పాల్పడ్డ యువకుడిని మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తోన్న వైనం
  • పంచాయతీ సభ్యుల కోసం పోలీసుల గాలింపు
  • నిందితుడి అరెస్టు
  • ఛత్తీస్‌గ‌ఢ్‌లో ఘటన

లైంగిక వేధింపుల‌కు గురైన ప‌ద‌మూడేళ్ల బాలికకు శుద్ధీక‌ర‌ణ పేరుతో పంచాయ‌తీ పెద్దలు అర‌గుండు చేయించిన ఘ‌ట‌న ఛత్తీస్‌గ‌ఢ్‌లోని కవర్ధాలో చోటు చేసుకుంది. అంతేగాక, ఆ బాలికతో ఎవ్వరూ మాట్లాడవద్దని, ఆమె గ్రామ ప్రజలకు దూరంగా ఉండాలని తీర్పు చెప్పి, ఆమెను బహిష్కరించారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అర్జున్ యాదవ్ అనే యువకుడు మాత్రం ఆ గ్రామంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అర్జున్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఆ బాలికను బహిష్కరించిన పంచాయతీ సభ్యులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.   

More Telugu News