NDTV: సుబ్రహ్మణ్య స్వామిపై నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసిన ఎన్డీటీవీ!

  • నిరాధార ఆరోపణలు చేస్తున్న స్వామి
  • మోదీని ఉద్దేశించి లేఖ రాసిన ప్రణయ్ రాయ్
  • ఆయన ఆరోపణల్లో నిజం లేదని వెల్లడి

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్డీటీవీ చీఫ్ ప్రణయ్ రాయ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖను రాశారు. ఆయన తమ చానల్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ చానల్ అమెరికాలోని ప్రముఖ చానల్స్ గా ఉన్న జీఈ, ఎన్బీసీల నుంచి అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని అన్నారు.

ప్రస్తుతం సీఎన్ఎన్ అధ్యక్షుడిగా ఉన్న అప్పటి ఎన్బీసీ సీఈఓ జెఫ్ జుకర్ తో పాటు, జీఈ సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ లకు మీడియా రంగంలో ఎంతటి పేరు వుందో అందరికీ తెలిసిందేనని, సుబ్రహ్మణ్య స్వామి ఏం ప్రయోజనాలు ఆశించి ఈ ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. తాను ఇమ్మెల్ట్, జుకర్ లను ఎన్నో మార్లు కలుసుకున్నానని, ప్రధాని హోదాలో మీరు కూడా కలుసుకున్నారని గుర్తు చేస్తూ, స్వామి వ్యాఖ్యలు ఇండియాలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని ప్రణయ్ రాయ్ హెచ్చరించారు.

More Telugu News