Amy Jackson: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఎమీ జాక్సన్ కు భారీ ఆఫర్ 
  • నానితో శేఖర్ కమ్ముల ప్రాజక్ట్ 
  • నాగశౌర్య 'కణం' సెన్సార్ పూర్తి 
  • రియాలిటీ షో చేయనున్న ఓంకార్

*  దక్షిణాది సినిమాలలో నటించే బ్రిటిష్ బ్యూటీ ఎమీ జాక్సన్ కు భారీ ఆఫర్ దక్కినట్టుగా చెబుతున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చిందట. సల్మాన్ నటించే 'కిక్ 2' చిత్రంలో నాయికగా ఎమీని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  'ఫిదా' సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ఏసియన్ ఫిలిమ్స్ సంస్థకు చేయనున్నాడు. ఇందులో హీరోగా నేచురల్ స్టార్ నాని నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
*  నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన 'కణం' చిత్రం సెన్సార్ పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేయనున్నారు.
*  ఇటీవల 'జీనియస్', 'రాజుగారి గది'. 'రాజుగారి గది 2'  చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓంకార్ 'స్టార్ మా' చానెల్ కోసం ఓ రియాలిటీ షో చేస్తున్నాడట. ఓంకార్ టీవీ యాంకర్ గా తన కెరీర్ని ప్రారంభించిన సంగతి విదితమే.      

More Telugu News