ke krishna murthy: మా సహనాన్ని ఇంకా పరీక్షించవద్దు: కేఈ కృష్ణమూర్తి

  • మార్చి 5 వరకు వేచి చూస్తాం
  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం జాతీయ అంశంగా మారింది
  • కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కేఈ కృష్ణమూర్తి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఏపీకి న్యాయం చేయకపోతే బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామంటూ వారు మండిపడుతున్నారు.

 తాజాగా, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాము అసంతృప్తితో ఉన్నామని, వచ్చేనెల 5 వరకు వేచి చూస్తామని, తమ సహనాన్ని ఇంకా పరీక్షించవద్దని వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని, తమకు న్యాయం చేయాల్సిందేనని అన్నారు. 

More Telugu News