KTR: విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించిన కేటీఆర్.. ప్రతిజ్ఞ సారాంశం ఇదే!

  • హైదరాబాదును పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ
  • పరిశుభ్రత కోసం విద్యార్థులు కృషి చేయాలని పిలుపు
  • ఏకకాలంలో రోడ్లను ఊడ్చిన 15,320 మంది విద్యార్థులు

హైదరాబాద్ నగరం పరిశుభ్రత కోసం విద్యార్థులంతా కృషి చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. నగర జనాభా కోటి కన్నా ఎక్కువ ఉందని... 22 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని క్లీన్ చేస్తే సరిపోదని... పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని అన్నారు. నగరంలోని బాగ్ లింగంపల్లిలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా 15,320 మంది విద్యార్థులు ఏకకాలంలో రోడ్లను ఊడ్చి గిన్నిస్ రికార్డును సాధించారు. అనంతరం విద్యార్థుల చేత కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.

ప్రతిజ్ఞ సారాంశం ఇదే:

  • ఇంట్లోని తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేస్తాను.
  • తడి చెత్తతో ఎరువు తయారు చేస్తాను.
  • బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయను. ఇతరుల్లో కూడా చైతన్యం తీసుకొస్తాను.
  • సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ బ్యాగులు వాడను. క్లాత్ లేదా జ్యూట్ బ్యాగులనే వాడతాను.
  • సిగరెట్ ను బహిరంగ ప్రదేశాలలో తాగను.
  • పాన్ తిని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయను.
  • చెత్తను కాల్చను. గాలిని కలుషితం చేయను.
  • ఇంటి నిర్మాణ వ్యర్థాలను ప్రభుత్వం సూచించిన ప్రదేశాల్లోనే వేస్తాను.
  • హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణబద్ధుడనై ఉంటాను.

More Telugu News