Cricket: 333-179.. రెండు వన్డేలలో రిపీట్ అయిన గణాంకాలు ... ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరోసారి ఇలా జరగదేమో!

  • జింబాబ్వే, ఆఫ్గనిస్థాన్ మధ్య వన్డే సిరీస్
  • చెరో మ్యాచ్ గెలిచిన జింబాబ్వే, ఆఫ్గన్
  • గణాంకాలన్నీ సేమ్ టూ సేమ్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నోమార్లు ఆసక్తికర ఘటనలు, గణాంకాలు నమోదయ్యాయి. కానీ, జింబాబ్వే, ఆఫ్గనిస్థాన్ మధ్య జరుగుతున్న సిరీస్ లో నమోదైన పరుగుల గణాంకాలు గతంలో ఎన్నడూ నమోదు కాలేదు సరికదా, భవిష్యత్తులోనూ నమోదు అవుతాయని భావించలేమని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒకే సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ లలో ఈ తరహా పరుగుల అంకెలు కనిపించడం ఇదే తొలిసారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందో తెలుసా?

తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేయగా, జింబాబ్వే జట్టు 179 పరుగులు మాత్రమే చేసి 10 వికెట్లనూ చేజార్చుకుని 154 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న జింబాబ్వే 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. అంతవరకూ ఓకే. 334 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 179 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇలా అన్ని అంశాలూ రిపీట్ కావడాన్ని క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

More Telugu News