India: ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్బీఐకి వెళ్లాయంటున్న ఆ రూ. 23 వేల కోట్లు ఎక్కడ?

  • ప్రశ్నించిన ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్
  • 46,93,16,000 పీస్ ల రూ. 500 నోట్లు మాయం
  • ముద్రించిన నోట్ల కన్నా అదనంగా రూ. 1000 నోట్లు
  • నేడు విచారించనున్న బాంబే హైకోర్టు

సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి, ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంలో అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి. నోట్ల రద్దుకు ముందు ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రితమైన కరెన్సీలో రూ. 23 వేల కోట్లకు పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకోలేదన్నది ఆర్టీఐ కార్యకర్త మనోరంజన్ రాయ్ పిటిషన్ కు వచ్చిన సమాధానం. ఆర్బీఐ, నోట్ల ముద్రణా కేంద్రాల్లో వివరాలను కోరుతూ ఆయన పిటిషన్ వేయగా సమాధానం లభించింది. దీని ఆధారంగా బాంబే హైకోర్టులో ఆయనో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు కూడా.

ఇక, రూ. 500 డినామినేషన్ లో 19,45,40,00,000 నోట్లను ఆర్బీఐకి పంపగా, 18,98,46,84,000 నోట్లు మాత్రమే చేరాయట. మిగతా 46,93,16,000 నోట్ల (వీటి విలువ రూ. 23,465 కోట్లు) కరెన్సీ ఎక్కడికి వెళ్లిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక రూ. 1000 కరెన్సీ నోట్లను 4,44,13,00,000 ముద్రించినట్టు లెక్కలుండగా, ఆర్బీఐ  4,45,30,00,000 నోట్లను అందుకున్నట్టు ఉంది. అంటే అదనంగా రూ.1,170 కోట్ల నోట్లు అందుకున్నట్టు చెబుతోంది. ఈ నోట్లు ఎక్కడివన్న వివరాలు లేవు. ఈ లెక్కల్లో తీవ్ర అయోమయం ఉందని చెబుతూ మనోరంజన్ రాయ్ వేసిన పిటిషన్ పై నేడు బాంబే హైకోర్టులో విచారణ జరగనుడటంతో ఈ విషయమై దేశ వ్యాప్తంగా ఆసక్తి కలుగుతోంది.

More Telugu News