Haz: తమ భయంకర అనుభవాలను 'మాస్క్ మీ టూ' అంటూ పంచుకుంటున్న ముస్లిం మహిళలు!

  • హజ్ యాత్రకు వెళ్లే మహిళలకు లైంగిక వేధింపులు
  • తాకరాని చోట తాకి ఇబ్బందులు పెడతారంటున్న మహిళలు
  • 'మాస్క్ మీ టూ' హ్యాష్ ట్యాగ్ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ఉండే ఏకైక కోరిక... తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఇస్లాంలో ఆఖరి పిల్లర్ గా చెప్పుకునే హజ్ యాత్ర చేసి రావాలని. ప్రతి సంవత్సరమూ సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కాకు లక్షలాది మంది ముస్లిం స్త్రీ పురుషులు వస్తుంటారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన ప్రాంతమైన హజ్ కు వచ్చి తమ పాపాలను కడుక్కోవాలని భావిస్తుంటారు.

అయితే, ఇక్కడికి వచ్చే మహిళలకు అత్యంత భయానక అనుభవాలు ఎదురవుతుంటాయి. పవిత్ర యాత్రకు వచ్చిన వారికి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. మక్కాకు, ఇతర మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను సందర్శించే వేళ, తమకు ఎదురవుతున్న అనుభవాలపై మహిళలు ఇప్పుడు గొంతెత్తారు.

'మాస్క్ మీ టూ' (#Mosquemetoo) అనే హ్యాష్ ట్యాగ్ ను తగిలిస్తూ, ఈజిప్షియన్ అమెరికన్ జర్నలిస్టు మోనా ఎల్తావే సామాజిక మాధ్యమాల ద్వారా ఈ హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభించగా, వేలాది మంది ముస్లిం మహిళలు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. తాను 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1982లో హజ్ యాత్రకు వెళ్లిన వేళ, అత్యాచారానికి గురయ్యానని, ఈ విషయాన్ని 2013లో ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని మోనా వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా మహిళలు తమ మౌనాన్ని వదిలి బయటకు రావాలని, తమకు ఎదురైన అనుభవాలను చెప్పాలని కోరారు. మక్కాలో యాత్రకు వచ్చేవారిలో పురుషుల సంఖ్య అధికమని, వారు ప్రతి మహిళనూ తమ సొంత సొత్తుగానే భావిస్తుంటారని ఆరోపించారు. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే లైంగిక వేధింపులు అధికమని, తాకరాని చోట తాకడం, అత్యాచారం చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయని పలువురు హ్యాష్ ట్యాగ్ ను ఫాలో అవుతున్నారు.

More Telugu News