London: బాంబు కనిపించడంతో లండన్ ఎయిర్ పోర్టు మూసివేత!

  • ఎయిర్ పోర్టులో విస్తరణ పనులు
  • వెలుగులోకి సెకండ్ వరల్డ్ వార్ బాంబు
  • అప్పట్లో జర్మనీ వేసిన బాంబు
  • నిర్వీర్యం చేసిన రాయల్ నేవీ

లండన్ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ ఎయిర్ పోర్టులో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కనిపించడంతో ఎయిర్ పోర్టును మూసివేశారు. కింగ్ జార్జ్-5 డాక్ లో విస్తరణ పనులు చేపట్టగా, ఈ బాంబు వెలుగులోకి వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు పెట్టుకున్న వారంతా, తదుపరి సమాచారం కోసం తమతమ ఎయిర్ లైన్స్ ను కాంటాక్టు చేయాలని సూచించారు.

ఈ విమానాశ్రయం నుంచి దగ్గరి ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులను నిర్వహిస్తుంటారు. ఆదివారం నాడు ఈ బాంబును కనుగొన్నామని, దాన్ని నిర్వీర్యం చేసే పనులు 17 గంటల పాటు సాగాయని లండన్ పోలీసులు తెలిపారు. రాయల్ నేవీలో పని చేసే ప్రత్యేక పోలీసు దళాలు దీన్ని నిర్వీర్యం చేశాయని వెల్లడించారు. సెప్టెంబర్ 1940 నుంచి మే 1941 మధ్యలో, జర్మనీ వాయుసేన ఈ బాంబును లండన్ పై జారవిడువగా, అది పేలకుండా ఉండిపోయిందని అధికారులు వివరించారు.

More Telugu News