Indigo: ఆ మూడు ఏ 320 విమానాలూ ఇక ఎగరవు: ఇండిగో

  • ఇంజన్లలో లోపం
  • ఎగిరేందుకు సురక్షితం కాదన్న ఈసా
  • ఇంజన్లను మారుస్తామన్న ఇండిగో

యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ (ఈసా) నుంచి వచ్చిన సూచనలతో మూడు ఏ 320 విమానాల సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది. ఈ విమానాల్లో ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లు పీడబ్లూ 1100 ఇంజన్లను వినియోగించగా, వీటిల్లో లోపాలు ఉన్నాయని, ఎగిరేందుకు ఇవి సేఫ్ కాదని ఈసా పేర్కొంది.

ఈ మేరకు వెంటనే విమానాలను నిలిపివేయాలని అత్యవసర సూచనలు చేయడంతో ఇండిగో వాటిని నిలిపింది. ఈ ఇంజన్లను తొలగించి, వాటిని సరికొత్త ఇంజన్ లతో మారుస్తామని తెలిపింది. ప్రాట్ అండ్ విట్నీ తయారు చేసిన కొన్ని ఇంజన్లలోనే లోపాలు తలెత్తాయని, వాటిల్లో మూడు ఇండియాలో, ఇండిగో తరఫున తిరుగుతున్నాయని, వాటిని రద్దు చేశామని డీజీసీఏ అధికారులు కూడా స్పష్టం చేశారు.

More Telugu News