pakoda: రోడ్డుపక్కన పకోడీలు వేస్తూ, అమ్ముతూ.. వినూత్నంగా 'పకోడా' నిరసన

  • ఇటీవల 'పకోడా' అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనన్న మోదీ
  • రాజ్యసభలోనూ అమిత్ షా 'పకోడా' వ్యాఖ్యలు
  • మండిపడ్డ ఎన్ఎస్‌యూఐ
  • మధ్య ప్రదేశ్‌లోని శివపురిలో ఆందోళన

ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ పకోడా (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగం లాంటిదేనని అన్న విష‌యం తెలిసిందే. దీంతో ఉద్యోగాల కల్పనపై మోదీ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇక‌ భిక్షాటనను కూడా ఉద్యోగంగానే చూడాలా? అని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ, రెండు రోజుల క్రితం రాజ్య‌స‌భ‌లో అమిత్ షా మాట్లాడుతూ మ‌రోసారి ‘పకోడా’ వ్యాఖ్య‌లు చేశారు. నిరుద్యోగులుగా ఉండటం కంటే పకోడాలు అమ్ముకోవడం మేల‌ని ఆయ‌న అన్నారు.

కాగా, ఈ విష‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ (ఎన్ఎస్‌యూఐ) ఈ రోజు ‘పకోడా ప్రొటెస్ట్’ పేరిట వినూత్నంగా నిరసన తెలిపింది. మధ్య ప్రదేశ్‌లోని శివపురిలో రోడ్డు పక్కన పకోడీలు వేస్తూ, వాటిని అమ్ముతూ ఇదే తమ వృత్తి అంటూ సదరు కార్యకర్తలు చురకలంటించారు. ఉద్యోగాల కల్పన చేయకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కాలం గడిపేస్తోందని విమర్శించారు.    

More Telugu News