Viral Videos: రోడ్డుపై వృద్ధురాలిపై యువకుడి ప్రతాపం.. ఘోరంగా కొట్టిన వైనం.. వీడియో వైరల్

  • తోసేసి, కాలితో తన్నుతూ అమానవీయంగా ప్రవర్తించిన వైనం
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
  • ఉత్తరప్రదేశ్‌ బరేలిలో ఘటన

వృద్ధురాలిని ఓ వ్య‌క్తి తోసేసి, కాలితో తన్నుతూ అమానవీయంగా ప్రవర్తించిన ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌ బరేలిలో చోటు చేసుకుంది. ఆమెపై ఆ వ్య‌క్తి ఇంత‌టి దారుణానికి పాల్ప‌డుతుండ‌గా రోడ్డుపై వెళ్తున్న వారు చూస్తూ వెళ్లారే త‌ప్ప ఒక్కరూ కూడా అడ్డుకోలేదు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. తాజాగా ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో వైర‌ల్ గా మారింది. ఆ వ్య‌క్తి ఈ దుశ్చ‌ర్య‌కు ఎందుకు పాల్ప‌డ్డాడ‌న్న విష‌యం  తెలియాల్సి ఉంది. రోడ్డుపై కొట్టిన తరువాత ఆమెను అతడు అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు.    

More Telugu News