CCTV: రెండో అంతస్తు నుంచి కిందపడ్డ కారు.. ఇద్దరికి గాయాలు.. సీసీ కెమెరాలో రికార్డు

  • చైనాలోని చోంగ్వింగ్ లో ఘటన 
  • పార్కింగ్ గ్యారేజ్ లోంచి తీసుకెళుతుండగా పడ్డ కారు
  • కారు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా నడపడంతోనే ప్ర‌మాదం

రెండో అంత‌స్తు నుంచి ఓ కారు కిందప‌డిపోయిన ఘ‌ట‌న చైనాలోని చోంగ్వింగ్ లో ఇటీవ‌ల చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్త‌మ‌య్యాయి. రెండో అంతస్తులో ఉన్న‌ పార్కింగ్ గ్యారేజ్ లోంచి ఆ కారు ఇలా కిందప‌డిపోయింది. ఆ కారుని న‌డుపుతోన్న డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిసింది. పార్కింగ్ చేసిన‌ కారును గ్యారేజ్ లోంచి తీసుకెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌తో స్వల్ప గాయాల‌పాలైన‌ కారులోని ఇద్దరిని అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది కారులోంచి బయటకు లాగారు.   

More Telugu News