uc: అదిరిపోయే ఫీచర్లతో యూసీ బ్రౌజర్ 12.0 ఆండ్రాయిడ్ యాప్!

  • ఆకట్టుకునే ఫీచర్లతో 12.0 వెర్షన్‌ లాంచ్
  • వెదర్ అప్‌డేట్స్, రాశి ఫలాలను తెలుసుకోవచ్చు
  • తక్కువ ర్యామ్ ఉన్నప్పటికీ స్మూత్‌గా పనిచేసేలా తీర్చిదిద్దారు

ఆకట్టుకునే  ఫీచర్ లతో యూసీ వెబ్ సంస్థ తన యూసీ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యాప్‌కు గాను సరికొత్త 12.0 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఉన్న మల్టీ టాస్కింగ్ ఫీచర్‌తో ఓ వైపు వీడియోలను డౌన్‌లోడ్ చేస్తూనే మరోవైపు వాటిని ఎలాంటి బఫరింగ్ లేకుండా వీక్షించవచ్చు.

యూసీ బ్రౌజర్ 12.0 ఫీచర్స్:

  • యూసీ బ్రౌజర్ 12.0 అప్‌డేట్‌లో యూజర్లకు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి.
  • యూజర్లు ఆయా సైట్లలో వీడియోలు చూస్తే 50 శాతం తక్కువ మొబైల్ డేటాను వాడుకుంటుంది.
  • తక్కువ జీబీ ర్యామ్ (1/2) ఉన్నప్పటికీ స్మూత్‌గా పనిచేసేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.
  • యూజర్లు నిత్యం తమ ప్రాంతంలో ఉన్న వెదర్ అప్‌డేట్స్, తమ రాశి ఫలాలను తెలుసుకోవచ్చు.
  • మల్టీ టాస్కింగ్ ఫీచర్‌తో ఓ వైపు వీడియోలను చూస్తూనే మరో వైపు వెబ్‌సైట్లను బ్రౌజింగ్ చేసుకోవచ్చు.
  • సీపీయూ ఎలాంటి ఓవర్‌హీట్‌కు గురి కాకుండా ఈ యాప్‌ను నూతనంగా తీర్చిదిద్దారు.

More Telugu News