leg cricket: లెగ్ క్రికెట్.. ఫోర్లు, సిక్సర్లు అన్నీ కాళ్లతోనే! వీడియో చూడండి

  • క్రికెట్, ఫుట్ బాల్ కలిపితే లెగ్ క్రికెట్
  • నాలుగు దేశాల్లో ఆడుతున్నారు
  • 2011లో భారత లెగ్ క్రికెట్ సమాఖ్య ఏర్పాటు

మనకు క్రికెట్ తెలుసు. ఫుట్ బాల్ తెలుసు. ఈ రెండింటిని కలపి ఆడేదే లెగ్ క్రికెట్. ఇప్పుడిప్పుడే ఈ ఆటకు క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతానికి ఈ ఆటను భారత్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లలో ఆడుతున్నారు. భారత్ తన తొలి అంతర్జాతీయ లెగ్ క్రికెట్ సిరీస్ ను నేపాల్ తో 2013లో ఆడింది. ఆ టీ10 సిరీస్ ను భారత్ గెలుచుకుంది. భారత లెగ్ క్రికెట్ సమాఖ్య 2011లో ఏర్పాటైంది.

లెగ్ క్రికెట్ ఆల్ మోస్ట్ క్రికెట్ లాంటిదే. దీనికీ కొన్ని నిబంధనలు ఉన్నాయి. క్రికెట్ లో బంతిని బ్యాట్ తో కొడితే, ఈ ఆటలో కాలితో తన్నాలి. మైదానం 80 నుంచి 120 అడుగుల వ్యాసార్ధంతో ఉంటుంది. పిచ్ ఎనిమిది అడుగుల వెడల్పు, 42 నుంచి 48 అడుగుల పొడవు ఉంటుంది. రెండు వైపులా వికెట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో బ్యాట్స్ మెన్ ను లెగ్స్ మెన్ అంటారు.

బౌలర్ అండర్ ఆర్మ్ శైలితో బంతని పిచ్ పై దొర్లిస్తాడు. పరుగుల కోసం లెగ్స్ మెన్ బంతిని కాలితో తంతాడు. సింగిల్స్, డబుల్స్, ఫోర్లు, సిక్సులు క్రికెట్లో మాదిరే ఉంటాయి. బంతిని రెండు సార్లు తాకితే లెగ్స్ మెన్ ఔట్ అవుతాడు. సాధారణంగా ఆడే కాలితో కాకుండా, మరో కాలితో తన్నినా ఔటే. ఏ కాలితో ఆడబోతున్నాడో అంపైర్ కు లెగ్స్ మెన్ ముందే చెప్పాలి. క్యాచ్ లు, బౌల్డ్, రనౌట్, స్టంపింగ్, హిట్ వికెట్లు ఉంటాయి. క్రికెట్లో మాదిరే ఇందులో కూడా చాలా వ్యూహాలు పన్నుతారు. స్లోగా, వేగంగా డెలివరీలు వేస్తారు.

More Telugu News