NEET-2018: నీట్ పరీక్ష మే 6న..జూన్ 5న రిజల్ట్స్

  • నీట్ నోటిఫికేషన్ జారీ చేసిన సీబీఎస్సీ
  • మార్చి 9 వరకు ఆన్ లైన్ లో అందుబాటులో దరఖాస్తులు 
  • ఏప్రిల్ రెండో వారంలో ఆన్ లైన్ లో హాల్ టికెట్లు

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్సీ) నీట్‌ - 2018 నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి సీబీఎస్సీ మే 6న నీట్ పరీక్షను నిర్వహించనుంది. జూన్‌ 5న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లిష్‌, హిందీతో పాటు తొమ్మిది భాషల్లో ప్రశ్నపత్రం ముద్రించనున్నామని, విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే వారి భాషను ఎంపిక చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నీట్ రాసేందుకు 12వ తరగతి పాసైన వారు అర్హులని, 17-25 మధ్య వయస్కులై ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉండగా, జనరల్‌, ఓబీసీ అభ్యర్ధులు 1400 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించాలన్నారు. మార్చి 9వ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని దరఖాస్తు మార్పులకు అదనంగా నాలుగు రోజుల గడువు ఉంటుందని వారు తెలిపారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి హాల్‌ టికెట్లు ఆన్ లైన్ లో డౌన్‌ లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు. 

More Telugu News