ke krishnamurthy: కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది: కేఈ కృష్ణమూర్తి

  • తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేఈ కృష్ణమూర్తి 
  • కేంద్ర ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి
  • తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేసింది
  • బీజేపీ తలుపు తెరచి అన్యాయం చేస్తోంది

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని అసంతృప్తితో ఉన్న ఏపీ మంత్రులు కేంద్రప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటుందని ఆశిస్తున్నామని, తీరుని మార్చుకోకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.

ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ....  నిన్న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. అప్పట్లో తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే, ఇప్పుడు బీజేపీ తలుపు తెరచి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

More Telugu News