Twitter: ‘మెహబూబా’ సినిమా టీజర్‌పై ఆర్జీవీ సహా పలువురి ట్వీట్లు!

  • తన కుమారుడు ఆకాశ్‌ పూరీ హీరోగా పూరీ కొత్త సినిమా
  • పూరీ జగన్నాథ్‌ సినీ కెరీర్‌లోనే ఉత్తమమైన సినిమాలా ఉంది: వర్మ
  • ఆకాశ్‌కి మంచి భ‌విష్య‌త్ ఉంది: ప్రియ‌మ‌ణి

త‌న కుమారుడు ఆకాశ్‌ పూరీని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ‘మెహబూబా’ సినిమాని రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుద‌లైన నేప‌థ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు దీనిపై స్పందించారు. పూరీ జగన్నాథ్‌ సినీ కెరీర్‌లోనే ఉత్తమమైన సినిమాలా ఉందని, ‘మెహబూబా’ అన్ని ప్రేమకథలను మేళవించి తీసినట్లు ఉందని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ చేశారు.

ఈ సినిమా టీజ‌ర్ అద్భుతంగా ఉంద‌ని, ఆకాశ్‌కి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని న‌టి ప్రియ‌మ‌ణి ట్వీట్ చేసింది. ‘టీజర్‌ చాలా చాలా బాగుంది. పూరీ, ఆకాశ్‌ కాంబినేషన్లో ఈ సినిమా‌ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా’ అని న‌టుడు వ‌రుణ్ తేజ్ పేర్కొన్నాడు. వావ్ పూరీ స‌ర్.. సూప‌ర్బ్ అని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, ర‌చ‌యిత కోన వెంక‌ట్ పేర్కొన్నారు. 

More Telugu News