Uttar Pradesh: సీసీ కెమెరాల మహిమ... యూపీలో 5 లక్షల మంది పరీక్షలకు డుమ్మా!

  • యూపీలో పది, ఇంటర్ పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్ధులు 66 లక్షలు
  • తొలి రెండు పరీక్షలకు 5 లక్షల మంది గైర్హాజరు
  • సీసీ కెమెరాల భయంతోనే పరీక్షలకు గైర్హాజరు

ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖాధికారులు రచించిన వ్యూహానికి విద్యార్థులు షాక్ తింటున్నారు. దీంతో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తొలి రెండు పరీక్షలకు డుమ్మాకొట్టారంటే వ్యూహం ఎంత షాకిచ్చిందో చూడండి. దాని వివరాల్లోకి వెళ్తే.. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరీక్షలంటే చూచి రాతలు, స్లిప్పులు రాయడాలు సర్వసాధారణం. ఈ చూసి రాతలు, స్లిప్పులు అందించడానికి సంబంధించిన ఘటనల ఫోటోలు మీడియా పతాక శీర్షికలకెక్కేవి.

బీహార్ లో రూబీ రాయ్ ఘటన తరువాత యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ పదోతరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాటిని అమలు పరిచారా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు.

దీంతో బెంబేలెత్తిపోయిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ యేడాది యూపీలో పది, ఇంటర్ పరీక్షలు 66 లక్షల మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, తొలి రెండు రోజుల్లో 5 లక్షల మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇంకా చాలా పరీక్షలు ఉండడంతో మరెంతమంది గైర్హాజరవుతారోనని చర్చించుకుంటున్నారు. 

More Telugu News