పెను కలకలం... పాక్ కోసం పనిచేస్తున్న భారత ఎయిర్ ఫోర్స్ అధికారి అరెస్ట్!

09-02-2018 Fri 09:17
  • సైనిక రహస్యాలను చేరవేస్తున్న అధికారి
  • వాయుసేనలో పని చేస్తూ, పాక్ కు సమాచారం చేరవేత
  • రహస్య ప్రాంతంలో విచారిస్తున్న భద్రతాధికారులు
పాకిస్థాన్ తరఫున పనిచేస్తూ, భారత సైనిక రహస్యాలను ఆ దేశానికి పంపిస్తున్నాడన్న ఆరోపణలపై ఓ ఉన్నతాధికారిని అరెస్ట్ చేయడం ఇప్పుడు సైనిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భారత వాయుసేనలో ఉన్నత పదవిలో ఉన్న కెప్టెన్‌ అరుణ్‌ మార్‌ వా, ఇక్కడ గూఢచారిగా పనిచేస్తూ, ఎంతో సమాచారాన్ని పాక్ కు చేరవేశాడని తెలుస్తోంది.

 ఐఎస్ఐ తదితర సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అరుణ్ మార్ వా ను అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఆయన తన ఫోన్ నుంచి వాట్స్ యాప్ మాధ్యమంగా ఎన్నో ఫోటోలు, కీలక పత్రాలను ఐఎస్ఐకి చేరవేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.