ap7am logo

రామలక్ష్మిగా సమంత... రేపు ఉదయం శామ్ కోసం ప్రత్యేకంగా 'రంగస్థలం' టీజర్?

Thu, Feb 08, 2018, 08:49 PM
  • 'రంగస్థ‌లం 1985' సినిమాలో సమంత పాత్ర ఎలాగుంటుందో రేపు తెలుసుకోనున్న అభిమానులు
  • మా రామలక్ష్మిని రేపు కలవండి అంటోన్న సినీ బృందం
  • అచ్చ‌మైన తెలుగు అమ్మాయిలా లంగా ఓణీలో కనపడనున్న సమంత?
చెన్నై బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం 'రంగస్థ‌లం 1985' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఆ సినిమా ట్రైలర్‌లో సమంత కనపడలేదని ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, రేపు ఈ సినిమాలోని ఆమె లుక్ విడుదల కానుంది. ‘మా రామలక్ష్మిని రేపు 11 గంటలకు కలవండి’ అంటూ ఆ సినిమా బృందం ఈ రోజు ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అంటే ఈ సినిమాలో సమంత పేరు రామలక్ష్మి అని చెప్పేశారన్నమాట. అలాగే, ఇందులో ఈ ముద్దుగుమ్మ అచ్చ‌మైన తెలుగు అమ్మాయిలా లంగా ఓణీలో కనపడనుంది. కాగా,  ఈ సినిమా రామ్ చరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథతో ఇది రూపొందుతోంది. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad