king cobra: కొండచిలువ, నాగుపాము ఫైట్.. రెండూ గెలవలేదు!

  • బలమైన పాముగా కొండచిలువకు పేరు
  • విషసర్పంగా నాగుపాముకు పేరు
  • ఆగ్నేయాసియాలో తలపడ్డ కొండచిలువ, నాగుపాము

కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. ఈ ఫైట్ లో రెండూ ప్రాణాలు కోల్పోయాయి.

ఈ ఫైట్ ఎక్కడ జరిగిందన్నది సరిగ్గా తెలియనప్పటికీ, ఆసియాలోనే జరిగి ఉంటుందని నిపుణుల అంచనా. కాగా, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

More Telugu News