central defenca ministree: ఆ గ్రామస్తులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు!

  • బొంజా గ్రామంలో నివసించే 31 వ్యవసాయాధారిత కుటుంబాలు
  • రక్షణ శాఖ కీలక స్థావరాన్ని బొంజా గ్రామంలో ఏర్పాటు
  • 200 ఎకరాలకు 40.83 కోట్ల పరిహారం

అరుణాచల్ ప్రదేశ్ లోని బొంజా గ్రామవాసులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. దీంతో ఆసియా దేశాల్లో సంపన్నుల గ్రామంగా రికార్డుకెక్కింది. దీనికి కారణాల్లోకి వెళ్తే... వ్యవసాయాధారిత గ్రామమైన బొంజాలో 31 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భారత రక్షణ శాఖ కీలక స్థావరాలను నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసింది. అలా ఎంపిక చేసిన గ్రామాల్లో చిన్ని గ్రామమైన బొంజా ఒకటి.

దీంతో ఈ గ్రామంలోని 31 కుటుంబాల చేతుల్లోని 200 ఎకరాల భూమిని రక్షణ శాఖ తీసుకుంది. దీనికి ప్రతిగా గ్రామస్థులకు 40.83 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చింది. అలా నష్టపరిహారం పొందిన కుటుంబాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యాయి. ఈ పంపకాల్లో ఒక కుటుంబానికి 6.73 కోట్ల రూపాయలందగా, మరో కుటుంబానికి 2.44 కోట్లు అందాయి. 31 కుటుంబాల్లో 29 కుటుంబాలకు కోటి 9 లక్షల రూపాయలకు పైగా నష్ట పరిహారం దక్కింది. దీంతో కోటీశ్వరులైన గ్రామంగా బోంజా రికార్డులకెక్కింది.

More Telugu News