tarun bhaskar: తరుణ్ భాస్కర్ నెక్స్ట్ మూవీ రిలీజ్ అయ్యేది అప్పుడే

  • కొత్త నటీనటులతో తరుణ్ భాస్కర్ 
  • పరిశీలనలో ' ఈ నగరానికి ఏమైంది' టైటిల్ 
  • ఏప్రిల్ రెండవ వారంలో విడుదల

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ తన సత్తా చాటిచెప్పాడు. ఈ సినిమా హిట్ తరువాత చాలామంది హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించారు. అయితే ఆయన మాత్రం తాను తయారు చేసుకున్న కథకి తగినట్టుగా కొత్త నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగును తరుణ్ భాస్కర్ పూర్తిచేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండవ వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాయకా నాయికల జర్నీ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం 'ఈ నగరానికి ఏమైంది?' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాకి సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్, ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.     

More Telugu News