kirrak party: కిరాక్ పార్టీ సినిమా విడుదల వాయిదా?

  • నిఖిల్ కిరాక్ పార్టీ విడుదల వాయిదా
  • ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర యూనిట్
  • మార్చి లేదా ఏప్రిల్ లో విడుదల చేస్తామని తాజాగా ప్రకటన

నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందిన కిరాక్ పార్టీ సినిమాను ఈ నెల 9న విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ఆ చిత్రబృందం ప్రకటించింది. అయితే అనివార్యకారణాల వల్ల ఈ సినిమాను ఈ నెల 9న విడుదల చేయడం లేదని ప్రకటించింది. ఈ సినిమాను మార్చి లేదంటే ఏప్రిల్ లో విడుదల చేస్తామని ఆ చిత్రబృందం ప్రకటించింది. పక్కా రిలీజ్ డేట్ ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. కన్నడలో విడుదలైన 'కిర్రాక్ పార్టీ'కి రీమేక్ గా తెలుగులో 'కిరాక్ పార్టీ' రూపొందుతోంది. పూర్తి కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నిఖిల్, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరాన్జ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

More Telugu News