world record: 200 వికెట్లు తీసిన భారతీయ తొలి మహిళా బౌలర్!

  • మహిళల వన్డే క్రికెట్ లో 200 వికెట్లు సాధించిన తొలి మహిళ జులన్ గోస్వామి
  • జులన్ పై ప్రశంసల వెల్లువ 
  • పురుషుల వన్డే క్రికెట్ లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ కపిల్ దేవ్

మహిళా క్రికెట్ చరిత్రలోనే ఇదివరకెవరూ సాధించని అరుదైన రికార్డును భారత మహిళా వెటరన్ క్రికెటర్ జులన్ గోస్వామి తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌ షిప్‌ లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌‌ ద్వారా జులన్ గోస్వామి 200 వికెట్లు సాధించిన భారతీయ తొలి మహిళా క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సఫారీ మహిళలతో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

303 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలకు గోస్వామి ఆరంభంలోనే షాక్ ఇచ్చింది. 32 పరుగుల వద్దే వోల్వార్ట్ (9)ను పెవిలియన్ బాటపట్టించింది. దీంతో 166 వన్డేల్లో 200 వికెట్లు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌ గా చరిత్రపుటల్లోకి ఎక్కింది. దీంతో ప్రపంచ రికార్డు సృష్టించిన జులన్ గోస్వామిని తాజా, మాజీ క్రికెటర్లు, నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా పురుషుల వన్డేల్లో కూడా 200 వికెట్లు సాధించిన మొదటి బౌలర్‌ భారత్‌ కు చెందిన మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌ కావడం విశేషం.

More Telugu News