america: అమెరికా చరిత్రలో లేని సరికొత్త సంప్రదాయానికి నాంది పలకనున్న ట్రంప్!

  • ఇంతవరకు సైనిక పరేడ్ నిర్వహించని అమెరికా
  • ఫ్రాన్స్ బ్యాస్టిల్ డే ప్రదర్శన చూసి ముచ్చటపడ్డ ట్రంప్
  • సైనిక బలగాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని పెంటగాన్ కు ఆదేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చరిత్రలో లేని సరికొత్త సంప్రదాయానికి తెరదీయనున్నారు. ప్రపంచ దేశాలకు తమ సైనిక సత్తాను చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం తన సంప్రదాయంలో లేని విధంగా అమెరికా త్వరలో భారీ సైనిక కవాతు నిర్వహించనుంది. ట్రంప్‌ ఆదేశాల మేరకు పెంటగాన్‌ సైనిక కవాతుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్ర్యదినోత్సవం, రిపబ్లిక్ డేల సందర్భంగా భారత్‌, చైనా, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఏటా మిలిటరీ పరేడ్‌ నిర్వహించి తమ సైనిక సత్తా చాటుతుండగా, అమెరికాలో ఇప్పటివరకు ఇలాంటి ప్రదర్శన జరగలేదు.

అయితే గతేడాది ఫ్రాన్స్ బ్యాస్టిల్ డే వేడుకలకు హాజరైన ట్రంప్ వారి సైనిక పరేడ్ ను చూసి ముచ్చటపడ్డారు. అమెరికా కూడా ఇలాంటి పరేడ్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. ఈ నేపథ్యంలో పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పెంటగాన్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ ప్రకటన చేస్తూ, దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల పట్ల అధ్యక్షుడు ట్రంప్‌ కి ఎంతో గౌరవం ఉందని, ఆయనతోపాటు దేశ ప్రజలందరూ వారి పట్ల తమ కృతజ్ఞత చాటుకునేలా గొప్ప వేడుక నిర్వహించాలని కోరారని అన్నారు. 

More Telugu News