varun tej: 'తొలిప్రేమ'లో డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాను: రాశి ఖన్నా

  • డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది 
  • మూడు రకాల లుక్స్ తో కనిపిస్తాను 
  • వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు

వరుణ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా రూపొందిన 'తొలిప్రేమ', ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం యూత్ ఆసక్తితో ఎదురుచూస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోన్న రాశి ఖన్నా మాట్లాడుతూ, తాను 'వర్ష' అనే పాత్రలో కనిపిస్తానని చెప్పింది.

ఈ పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందనీ, సినిమా మొత్తం మీద మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తానని అంది. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పింది. స్క్రిప్ట్ ఫై రెండు సంవత్సరాలుగా కసరత్తు చేస్తూ వచ్చిన వెంకీ అట్లూరి, ఈ సినిమాను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడని, ప్రేమ అనేది మెచ్యూరిటీ లెవెల్స్ ను బట్టి ఎలా మారుతూ వెళుతుందనే కాన్సెప్ట్ ను ఆయన బాగా చెప్పాడని అంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఎంతగానో కష్టపడ్డాడని, తాము పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.   

More Telugu News