sensex: వరుసగా ఏడో రోజు కూడా... లాభాల్లోకి వెళ్లినా, చివరకు నష్టాలే!

  • నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 113 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 22 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా ఏడో రోజు కూడా కొనసాగింది. అమెరికా మార్కెట్లు కొంత కోలుకున్న నేపథ్యంలో, మన దేశీయ సూచీలు కూడా ఉదయం లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగింది. అయితే ఆ జోరు ఆ తర్వాత కొనసాగలేకపోయింది. ఆర్బీఐ పాలసీ రివ్యూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. చివరకు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 113 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 34,083 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 22 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,477 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సెంచురీ ప్లైబోర్డ్స్ (15.24%), చంబల్ ఫర్టిలైజర్స్ (11.79%), రెయిన్ ఇండస్ట్రీస్ (9.56%), ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (9.24%), బజాజ్ ఎలక్ట్రికల్స్ (9.02%).

టాప్ లూజర్స్:
నాట్కో ఫార్మా (-8.06%), వక్రాంగీ లిమిటెడ్ (-5.00%), రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్ (-4.48%), యునైటెడ్ బ్రూవరీస్ (-4.17%), బేయర్ క్రాప్ సైన్స్ లిమిటెడ్ (-3.86%).   

More Telugu News