Hyderabad: హైదరాబాద్‌లో ‘మైనింగ్ టుడే’ అంతర్జాతీయ సదస్సు

  •  హైటెక్స్ వేదికగా ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు సదస్సు
  • దేశ విదేశాల నుంచి హాజరు కానున్న మైనింగ్ కంపెనీలు, ప్రజాప్రతినిధులు
  • గవర్నర్ నరసింహన్ కు ఆహ్వానపత్రం అందజేసిన మంత్రి కేటీఆర్

 హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని అవకాశాలు, మైనింగ్ అనుబంధం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించే నిమిత్తం ‘మైనింగ్ టుడే’ పేరిట అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్ ఏర్పాటు కానున్నాయి. హైటెక్స్ లో ఈ నెల 14 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటుతో మైనింగ్ ఇంజనీర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఏఈఐఏ), ఫిక్కి సంయుక్తంగా నిర్వహించనున్నాయి. టెక్నాలజీ, ఎక్విప్ మెంట్, మేషినరీ, పాలసీ, ఒవర్ సీస్ (టెంపో) థీమ్ తో ఈ సమావేశం జరగనుంది.  

దేశ ఆర్థిక ప్రగతిని బలోపేతం చేసేందుకు మైనింగ్ కీలకమైన అంశం అని, పవర్, సిమెంట్, ఏరోస్పేస్, ఢిఫెన్స్, ఆయిల్, గ్యాస్ వంటి రంగాలను ప్రభావితం చేసే పలు అంశాలను, ఖనిజాల అన్వేషణలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులపైన ప్రధానంగా చర్చించనున్నారు. మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం అంశంలో గనుల గుర్తింపులో రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల వినియోగం, గనులకు రేటింగ్ ఇవ్వడం, గనుల పర్యవేక్షణ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పైన వివిధ దేశాల నుంచి వచ్చే నిపుణులు చర్చిస్తారు.

దీంతోపాటు మైనింగ్ పాలసీలు, వాతావరణం, మైనింగ్ రంగంలోని అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాలపైన ఈ సదస్సులో చర్చించడంతోపాటు ఆయా అంశాలకు సంబంధించిన నూతన ప్రొడక్టులను ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా ఇసుక ప్రొక్యూర్ మెంట్ విధానాల అధ్యయనంలో భాగంగా బీచ్ సాండ్స్, రివర్ సాండ్స్, క్రష్డ్ స్టోన్ సాండ్( రాతి ఇసుక) వంటి అంశాలను ప్రత్యేకంగా చర్చిస్తారు.

మైనింగ్ రంగంలోని పెట్టుబడుల అవకాశాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అవకాశాలు, మైనింగ్ అనుబంధం రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపైన ఈ సమావేశంలో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సదస్సుకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికాలోని దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ‘మైనింగ్ టుడే’ సదస్సుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నరసింహన్ ని కలిసిన మంత్రి కేటీఆర్, ఆయనకు ఆహ్వానపత్రం అందజేశారు.

మైనింగ్ శాఖాధికారుల డైరీ ఆవిష్కరణ

గనుల శాఖాధికారుల 2018 డైరీని గనుల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. డైరెక్టర్ అప్ మైన్స్ సుశీల్ కూమార్ ఆధ్యర్యంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖాధికారుల సంఘం రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News