Rasmi gautham: యాంకర్ అనసూయ అనుచిత ప్రవర్తనపై రష్మీకి అభిమాని ట్వీట్.. సమాధానం ఇచ్చిన 'జబర్దస్త్' భామ

  • ఇటీవల ఓ బాలుడి సెల్‌ఫోన్‌ పగులకొట్టిన అనసూయ
  • పబ్లిక్‌తో ఎలా ఉండాలో అనసూయకి చెప్పమని రష్మీకి అభిమాని ట్వీట్
  • 'నేను ఆమె సంరక్షకురాలిని కాదు' అని రిప్లై

హాట్ యాంక‌ర్‌, సినీ న‌టి అన‌సూయ ఇటీవ‌ల హైదరాబాద్ లోని తార్నాక‌లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి చేతిలోని ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టడంతో అది పగిలిపోయింది. దీంతో ఆ బాలుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అనసూయ దానిపై కామెంట్ చేసింది. మ‌రి కాసేప‌టికే సోష‌ల్ మీడియా నుంచి కూడా వైదొలిగిపోయింది.

కాగా, ఆమె స్నేహితురాలు, మ‌రో జ‌బ‌ర్ద‌స్త్ భామ ర‌ష్మీకి ఓ అభిమాని తాజాగా ఈ విషయంపై ఓ ట్వీట్ చేయ‌గా ఆమె కాస్త గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చింది. 'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పు, నేర్చుకుంటుంది' అని ఓ అభిమాని ర‌ష్మీకి ట్వీట్ చేశాడు. దీంతో ఆమె రిప్లై ఇస్తూ 'సారీ డ్యూడ్‌.. నేను ఆమె సంర‌క్ష‌కురాలిని కాదు' అని చెప్పుకొచ్చింది.  

More Telugu News