Chandrababu: 'ప్రధాని మాట్లాడమన్నారు' అంటూ చంద్రబాబుకు మరోసారి ఫోన్ చేసిన రాజ్ నాథ్!

  • విభజన చట్టం అమలు చేస్తామని ప్రధాని అన్నారు
  • హామీలన్నీ నెరవేరుస్తాం
  • నేడో, రేపో పరిష్కార మార్గం
  • ఆందోళనలు విరమించండి: బాబుతో రాజ్ నాథ్

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఆమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి తెలిపారు. ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడిన ఆయన, విభజన చట్టంలోని అన్ని హామీలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ లేదా రేపటిలోగా పరిష్కారమార్గం చూపాలన్నది మోదీ అభిమతమని తెలిపిన రాజ్ నాథ్, లోక్ సభ, రాజ్యసభల్లో టీడీపీ ఎంపీలు సంయమనం పాటించేలా చూడాలని కోరారు.

ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రధాని స్వయంగా తనను కోరారని అన్నారు. ఆందోళనలు విరమించాలని మీ ఎంపీలను కోరాలని చెప్పారు. హామీల అమలు విషయంలో తాను కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. కాగా, రెండు రోజుల క్రితం చంద్రబాబు మంత్రులు, ప్రధాన నేతలతో సమావేశం జరుపుతున్న సమయంలోనూ రాజ్ నాథ్ ఫోన్ చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే.

More Telugu News