Abu Dhabi: అబుదాబిలో 44 వాహనాలు 'ఢీ'....వీడియో చూడండి

  • దుబాయ్-అబుదాబిని కలిపే షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్ పై ప్రమాదం
  • పొగమంచు కారణంగా 44 వాహనాల ఢీ
  • 22 మందికి గాయాలు

అబుదాబి జాతీయ రహదారిపై 44 వాహనాలు ఢీ కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటి తెల్లవారు జామున దుబాయ్-అబుదాబిని కలిపే షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్ ను దట్టమైన పొగ మంచు కమ్మేసింది. కొద్ది మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కానరాని పరిస్థితి నెలకొంది.

దీంతో ఈ రహదారిలో ప్రయాణిస్తున్న సుమారు 44 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 22మంది గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టగా, ఈ ప్రమాద దృశ్యాలను సెల్ ఫొన్ లలో రికార్డు చేసినవారు సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ప్రమాద వీడియోలు వైరల్‌ గా మారాయి.    

More Telugu News