kalyan: చిరూ చిన్నల్లుడి సినిమా షూటింగ్ మొదలైపోయింది!

  • హీరోగా రంగంలోకి దిగిన చిరూ చిన్నల్లుడు 
  • ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • దర్శకుడిగా రాకేశ్ శశి  

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు ఎవరికి వారు .. తమదైన స్టైల్ తో యూత్ ను ఆకట్టుకుంటూ దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే ఆయన హీరోగా తొలి సినిమాను లాంచ్ చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టారు.

కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోంది. మాళవిక నాయర్ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, రాకేశ్ శశి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే నటనలోనూ .. డాన్స్ .. ఫైట్స్ లోను శిక్షణ తీసుకున్న కల్యాణ్, హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి. 

More Telugu News