Space X: 18 వేల జట్ లైనర్స్ శక్తితో... ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగించిన అమెరికా

  • స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ ప్రయోగం విజయవంతం
  • వేలాది మంది చూస్తుండగా దూసుకెళ్లిన రాకెట్
  • ఓ పర్వతమంత విస్తరించిన పొగ
  • 27 ఇంజన్ లతో రాకెట్ డిజైన్

ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన రాకెట్ 'స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ'ని అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. కేప్ కెనవెరల్ లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించగా, వేలాది మంది ప్రత్యక్షంగా తిలకించారు. భూమి నుంచి అంగారకుడి వరకూ ఉన్న దూరాన్ని ఏకధాటిగా అధిగమించేంతటి శక్తి దీని సొంతం. 18,747 జెట్ లైనర్స్ కు ఉండేంత శక్తితో ఇది ఆకాశంలోకి దూసుకెళ్లింది. చంద్రమండలం మీదకు అపోలో 11 సిబ్బందిని తీసుకెళ్లిన లాంచ్ ప్యాడ్ పై నుంచి దీన్ని ప్రయోగించడం గమనార్హం. ఈ రాకెట్ కదిలే ముందు, ఇంజన్ లను ఆన్ చేసిన తరువాత వచ్చిన పొగ ఓ భారీ పర్వత విస్తీర్ణమంత కనిపించింది. 27 ఇంజన్ లు, 3 బూస్టర్లు కలిగిన ఈ రాకెట్ దేన్నైనా మార్స్ వరకూ స్వల్పకాలంలో చేరుస్తుందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ ముస్క్ తెలిపారు. కాగా, ఈ రాకెట్ ప్రయోగానికి యూఎస్ సర్కారు ఎలాంటి నిధులనూ కేటాయించకపోవడం గమనార్హం. ప్రైవేటు నిధులతో, అంటే ఎలాన్ ముస్క్ తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయినప్పటికీ అమెరికా ఏరోస్పేస్ రంగంలో ఇదో కీలక మైలురాయని స్పేస్ ఫ్లోరిడా ప్రతినిధి డేల్ కెట్చామ్ వ్యాఖ్యానించారు. భద్రతా శాటిలైట్లను, అంతరిక్షంలోకి మానవ నిర్మాణాలను పంపాలన్న నాసా ఆశలను నెరవేర్చే సత్తా స్పేస్ ఎక్స్ కు ఉందని, పెంటగాన్ అవసరాలనూ తీరుస్తుందని చెప్పారు. కాగా, భూ కక్ష్యలో 1,40 లక్షల పౌండ్ల బరువుండే ఈ రాకెట్ మార్స్ సమీపానికి వెళ్లేసరికి కేవలం 40 వేల పౌండ్ల బరువు మాత్రమే ఉంటుందట.

More Telugu News