Petrol: వాహనదారులకు నిరాశ.. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం లేనట్టే!

  • పెట్రో ధరలపై రూ.2  సుంకం తగ్గింపు ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన ప్రభుత్వం
  • ద్రవ్యలోటు ఎక్కువగా ఉండే అవకాశాలుండడంతోనే నిర్ణయం
  • పెట్రో ధరల్లో 50 శాతం పన్నులే

పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇటీవలి బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున దిగుమతి  సుంకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించేలా లేకపోవడంతో ఈ విషయాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అంచనా వేస్తున్న దానికంటే ద్రవ్యలోటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అందుకనే ఈ ఆలోచన నుంచి ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

ఇక, దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే పెట్రో ధరలు భారత్‌లోనే అధికం. పెట్రోలు రిటైల్ ధరల్లో 50 శాతం పన్నులే ఉండడంతో ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా భారత్‌లో పెట్రో ధరలు అధికంగా ఉంటున్నాయి.

More Telugu News