bcci: బీసీసీఐ తనకు ప్రకటించిన నజరానాపై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • అండర్ -19 వరల్డ్ కప్ ను సమష్టి కృషితో సాధించాం
  • అలాంటప్పుడు, నజరానాల్లో తేడా లెందుకు?
  • సమానంగా ఉంటే బాగుండేది: రాహుల్ ద్రవిడ్

అండర్ -19 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు కోచ్ ద్రవిడ్ కు రూ.50 లక్షలు, ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. అయితే, ద్రవిడ్ తనకు రూ.50 లక్షల నజరానా ప్రకటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధించాం కనుక, ఇచ్చే ప్రోత్సాహకాలు అందరికీ సమానంగా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

కాగా, అండర్ -19 ప్రపంచ కప్ క్రికెట్ ను టీమిండియా సొంతం చేసుకున్న సందర్భంగా కోచ్ ద్రవిడ్ పై ప్రశంసలతో అభినందనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విజయం వెనుక కష్టమంతా ఆటగాళ్లదేనని, తనదేమీ లేదని, ప్రణాళికాబద్ధమైన ఆటతీరు, దానిని అమలు పరిచి విజయం సాధించడంలోనే అసలైన సంతృప్తి ఉందని ద్రవిడ్ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.  

More Telugu News