allu arjun: 'నా పేరు సూర్య'కు 6 కోట్ల నష్టం.. ఎలాగంటే!

  • అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'
  • కేరళ .. కన్నడ ప్రాంతాల్లో ఆయనకి మంచి ఫాలోయింగ్
  •  ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకి మంచి డిమాండ్

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు కేరళ .. కర్ణాటక ప్రాంతాల్లోను మంచి ఫాలోయింగ్ వుంది. ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ వుంది. అందువలన డిజిటల్ .. డబ్బింగ్ రైట్స్ ద్వారానే అల్లు అర్జున్ సగం పెట్టుబడిని రాబట్టేస్తుంటాడు.

 తాజాగా 'నా పేరు సూర్య' సినిమాకి కూడా మంచి క్రేజ్ వుంది. ఈ కారణంగానే ఈ సినిమా 'ఫస్టు ఇంపాక్ట్' బయటికి రాకముందే ఒక సంస్థ 12 కోట్లకి డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది. ఫస్టు ఇంపాక్ట్ బయటికి వచ్చిన తరువాత, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దాంతో మరో సంస్థవారు వచ్చి డిజిటల్ రైట్స్ ఇవ్వమంటూ 18 కోట్లు ఆఫర్ చేశారట. అప్పటికే 12 కోట్లకి అగ్రిమెంట్ కూడా పూర్తికావడంతో, తొందరపడి 6 కోట్లు నష్టపోయామే అని ఫీలవుతున్నారట. ఇక మిగతా బిజినెస్ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారట.  

More Telugu News