కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

06-02-2018 Tue 16:18
  • మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో ఘటన
  • మృతులు రమేశ్, మానస, మనశ్రీ (2), గీతశ్రీ (1) గా గుర్తింపు
  • ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వారుగా సమాచారం
ఇద్దరు ఆడపిల్లలు సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు  వివరాలు వెల్లడించారు. మృతులు రమేశ్, మానస, మనశ్రీ (2), గీతశ్రీ (1) అని తెలిపారు.

తమ పిల్లలతో కలిసి కీసర పెద్దమ్మ చెరువులోకి దూకి సదరు దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. వీరి ఆత్మహత్యలకు కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. వీరు ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.