hyderabad metro rail: హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ లో అగ్నిప్రమాదం.. వీడియో చూడండి

  • హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ప్రమాదం
  • వెల్డింగ్ పనులు జరగుతుండగా ఎగసిపడ్డ నిప్పురవ్వలు
  • మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

హైదరాబాద్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. స్టేషన్ లో వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. దీంతో, మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో వెల్డింగ్ పనులు చేస్తున్నవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News