raviteja: శ్రీను వైట్ల - రవితేజ సినిమాలో నివేదా థామస్ లేదట !

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 
  • టైటిల్ గా 'అమర్ అక్బర్ ఆంథోని'
  • త్వరలోనే సెట్స్ పైకి  

ప్రస్తుతం రవితేజ .. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్ ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్లతోను ఓ సినిమా చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు.  అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి 'అమర్ అక్బర్ ఆంథోని' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించనున్నాడనే వార్తలు ఒక వైపున వినిపిస్తూ ఉండగా, డిఫరెంట్ లుక్స్ తో మాత్రమే కనిపిస్తాడనే టాక్ మరో వైపున వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా కాజల్ ను .. మరో కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం గురించి నివేదా థామస్ స్పందిస్తూ .. ఈ సినిమాలో తాను చేస్తున్నట్టుగా జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇక కాజల్ ఏమంటుందో చూడాలి మరి.        

More Telugu News