Bakhtawar Bhutto Zardari: బెనజీర్ భుట్టో కుమార్తెల ప్రొఫైల్స్ ను తొలగించిన వికీపీడియా!

  • ప్రొఫైల్స్ లోని విషయాలకు హేతుబద్ధత లేదన్న వికీపీడియా
  • చాలా విషయాలను కాపీ, పేస్ట్ చేశారు
  • వీరికన్నా.. వీరి కుటుంబ సమాచారమే ఎక్కువగా ఉంది

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీల కుమార్తెలు భక్తవార్ భుట్టో జర్దారీ, అసీఫా భుట్టో జర్దారీలకు వికీపీడియా షాక్ ఇచ్చింది. వారి ప్రొఫైల్స్ ను వికీపీడియా నుంచి తొలగించింది. వీరి ప్రొఫైల్స్ లో ఉన్న అంశాలకు సరైన హేతుబద్ధత లేదని వికీపీడియా ఈ సందర్భంగా తెలిపింది.

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధికారిక వికీపీడియా పేజ్ లో ఉన్న విషయాలను వీరిద్దరి ప్రొఫైల్స్ లో కాపీ, పేస్ట్ చేశారని ఈ సందర్భంగా వికీపీడియా తెలిపింది. దీనికి తోడు, వీరికి సంబంధించిన విషయాలకన్నా... వీరి తల్లి బెనజీర్ భుట్టోకు సంబంధించిన విషయాలే వీరి ప్రొఫైల్స్ లో ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విషయాలను డిస్కషన్ పేజ్ లో వికీపీడియా పేర్కొంది.

భక్తవార్ ప్రొఫైల్ పేజ్ లో వికీపీడియాకు సంబంధించిన మూడు పాలసీలను ఉల్లంఘించారని తెలిపింది. కాపీ, పేస్ట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. ఈమె పేజ్ లో ఆమెకు సంబంధించిన మెరిట్ ఇన్ఫర్ మేషన్ కాకుండా, భుట్టో కుటుంబానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. భక్తరార్ కు సంబంధించి లోతైన కవరేజ్ లేదని పేర్కొంది. ఆమె ఎన్నిక కాబడిన పొలిటీషన్ కాదని, గుర్తించదగ్గ కెరీర్ కూడా ఆమెకు లేదని చెప్పింది. కేవలం న్యూస్ వెబ్ సైట్లలో ఉన్న విశ్లేషణలను ప్రాతిపదికగా తీసుకుని, వికీపీడియాలో సమాచారాన్ని పొందుపరిచారని తెలిపింది.

ఆసిఫా భుట్టో జర్దారీ ప్రొఫైల్ తొలగింపుపై కూడా వికీపీడియా ఇవే కారణాలను చూపింది. ఉన్నత స్థాయిలో లేకుండానే, ఆ స్థాయిని చూపించుకోవడం తప్పని వ్యాఖ్యానించింది.

More Telugu News