sai dharam tej: స్పీడ్ చూపిస్తోన్న సాయిధరమ్ తేజ్!

  • కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ 
  • ఈ నెల 16వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్

సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథా కథనాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన వినాయక్ దర్శకత్వంలో చేసిన 'ఇంటిలిజెంట్' కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనరే. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతూ ఉండగానే, తదుపరి సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలో సాయిధరమ్ తేజ్ వున్నాడు.

కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 16 నుంచి మొదలుకానుంది. ఇంతవరకూ సాయిధరమ్ చేస్తూ వచ్చిన పాత్రలకి ఈ సినిమాలోని పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.    

More Telugu News