BSE: పాతాళానికి సెన్సెక్స్... ఆరంభంలోనే 1000 పాయింట్ల పతనం, నిమిషంలో రూ. 5 లక్షల కోట్లు ఆవిరి!

  • యూఎస్ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లలో ఆందోళన
  • ఒక్కసారిగా భారీ ఎత్తున అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు
  • 3 శాతానికి పైగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

అమెరికా మార్కెట్ల భారీ పతనం ప్రభావం భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దారుణంగా దెబ్బతీసింది. ఈ ఉదయం ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ లో 700 పాయింట్ల నష్టాన్ని చూపిన సెన్సెక్స్, 9.15 గంటల సమయంలో ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఒక్క నిమిషం వ్యవధిలో 3 శాతానికి పైగా దిగజారిన సెన్సెక్స్ సూచిక, 9.20 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 1,041 పాయింట్లు పడిపోయి 33,715.69 పాయింట్లకు చేరింది.

సోమవారం నాడు రూ. 1,47,95,747 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్, ఈ ఉదయం రూ. 5 లక్షల కోట్లకు పైగా దిగజారి రూ. 1,42,51, 795 కోట్లకు చేరింది. మరో వైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏకంగా 323 పాయింట్లు పడిపోయి 10,343 పాయింట్లకు చేరింది. నిఫ్టీ-50లో ఒక్క కంపెనీ కూడా లాభాల్లో లేకపోవడం గమనార్హం. టాటా మోటార్స్, వీఈడీఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు 5 నుంచి 8 శాతం మేరకు నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News