Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'ఎన్ని కాస్ట్యూమ్స్ వాడానో' అంటున్న కీర్తి సురేశ్!  
  • మధురైలో షూటింగ్ చేస్తున్న తమన్నా 
  • జపాన్ లో దూసుకుపోతున్న 'బాహుబలి-2'
  • మరో హారర్ థ్రిల్లర్ లో నయనతార

*  ప్రస్తుతం తాను చేస్తున్న 'మహానటి' చిత్రం తాను ఇంతవరకు చేసిన చిత్రాలలో ఎంతో స్పాన్ వున్న చిత్రమని కథానాయిక కీర్తి సురేశ్ చెప్పింది. సాధారణంగా ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్ సరాసరి 30 కాస్ట్యూమ్స్ వాడుతుందని, మహానటిలో మాత్రం తాను 120 రకాల కాస్ట్యూమ్స్ వాడానని చెప్పింది.
*  కథానాయిక తమన్నా 'నా నువ్వే' తెలుగు చిత్రాన్ని పూర్తి చేసి, 'కన్నె కలైమనే' అనే తమిళ చిత్రం షూటింగులో జాయిన్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కోసం తమ్మూ మధురైలో వుంది. శ్రీను రామస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్నాడు.
*  ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం జపాన్ లో బాక్సాఫీసు దుమ్మురేపుతోంది. గత డిసెంబర్ 29న జపాన్ లో రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.
*  'మా', 'లక్ష్మి' వంటి లఘు చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు సర్జున్ దర్శకత్వంలో నయనతార ఓ చిత్రం చేయడానికి అంగీకరించింది. హారర్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ త్వరలో చెన్నయ్ లో మొదలవుతుంది.    

More Telugu News