mobile: భారత మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రానున్న ‘రెడ్ మి 5’

  • ఈ నెల 14న విడుదల కానున్న ‘రెడ్ మి 5’
  • 3 వేరియంట్లలో అందుబాటులోకి రానున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్
  • రెడ్ మి నోట్ 5 గా నామకరణం?

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. భారతీయ మార్కెట్ లోకి 'రెడ్ మి 5'ని విడుదల చేయనున్నట్టు షియోమి సంస్థ ప్రకటించింది. ఈ నెల 14న భారత్ లో నిర్వహించే కార్యక్రమంలో ఈ ఫోన్ వివరాలను వెల్లడించనుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ ధరలో రూపొందించిన ఈ ఫోన్లను మూడు వేరియంట్స్ లో విడుదల చేయనుంది.

2జీబీ ర్యామ్ -16 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉన్న ఫోన్ ధర రూ.8,100, 3 జీబీ ర్యామ్ -32 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ ధర రూ.9,100, 4 జీబీ ర్యామ్ - 32 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉన్న ఫోన్ ధర రూ.11,200 ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ కు 'రెడ్ మి నోట్ 5'గా నామకరణం చేస్తారని తెలుస్తోంది. ఇక, రెడ్ మి నోట్ 5 ఫీచర్ల విషయానికొస్తే 5.5 అంగుళాల టచ్ స్క్రీన్, 12 మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నట్టు సమాచారం.

కాగా, రెడ్ మి 5 ను గత ఏడాది డిసెంబర్ లో చైనాలో విడుదల చేశారు. చైనాలో విడుదల చేసిన ఈ ఫోన్ స్క్రీన్ 5.7 అంగుళాలు. భారత్ లో విడుదల కానున్న ఇదే ఫోన్ స్క్రీన్ 5.5 అంగుళాలు.

More Telugu News