మా సంగతేంటి?: లోక్ సభలో కదిలిన టీడీపీ

05-02-2018 Mon 09:29
  • స్వల్పకాలిక చర్చకు నోటీస్
  • రూల్ 193 ప్రకారం చర్చకు అనుమతించాలంటున్న టీడీపీ
  • నోటీసులిచ్చిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం
గత వారంలో పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏపీకి అన్యాయం జరిగిందని భావిస్తూ, పార్లమెంట్ లో ఒత్తిడి తేవాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు ఆ పార్టీ ఎంపీలు కదిలారు. ఈ ఉదయం విభజన హామీల అమలుపై టీడీపీ స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నోటీస్ ఇచ్చింది.

 లోక్ సభలో రూల్ 193 ప్రకారం నోటీస్ అందించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ తోట నరసింహం, దీనిపై వెంటనే చర్చకు అనుమతించాలని పట్టుబట్టనున్నామని అన్నారు. మరోవైపు రాజ్యసభలోనూ రాష్ట్రానికి న్యాయం చేయాలని, వెంటనే రైల్వే జోన్ ప్రకటించాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఎంపీలు నిరసన చేపట్టాలని నిర్ణయించారు.