Medaram: సమ్మక్క, సారక్క జాతర కోసం 22 తాత్కాలిక బార్ లు... 4 రోజుల అమ్మకాలు చూస్తే అవాక్కే!

  • జాతరలో ఏరులై పారిన మద్యం
  • రూ. 50 కోట్లకు పైగా అమ్మకాలు
  • చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెరిగిన విక్రయాలు

తెలంగాణ కుంభమేళ సమ్మక్క, సారక్క జాతరలో మద్యం ఏరులై పారింది. వనదేవతల జాతరలో మద్యం, మాంసాలకు ఎనలేని డిమాండ్ పెరుగగా, అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ భారీ ఆదాయాన్ని పొందింది. జాతర జరిగే నాలుగు రోజుల కోసం మేడారం ప్రాంతంలో 22 తాత్కాలిక బార్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.

మొత్తం రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయని, గతంలో మేడారంలో ఇంత భారీ అమ్మకాలు ఎన్నడూ సాగలేదని అధికారులు అంటున్నారు. మేడారంతో పాటు వరంగల్ చుట్టు పక్కల ప్రాంతాలైన భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం తదితర ప్రాంతాల్లోనూ మద్యం అమ్మకాలు ఈ నాలుగు రోజుల్లో గణనీయంగా పెరిగాయని అధికారులు వెల్లడించారు.

More Telugu News